లాక్ డౌన్ వేళ.. పోన్ కాల్ తో మామిడి పళ్ళు మీ ఇంటికే!

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడికాయలను ఎంతో ఇష్టంగా తింటారు.

Update: 2020-04-28 05:52 GMT
Mangoes

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడికాయలను ఎంతో ఇష్టంగా తింటారు. ఎంత ధరైనా సరే వెనకాడకుండా కొంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లోకి వెల్లి ఇష్టమైన పండ్లను తీసుకోలేని పరిస్థితి. దీంతో రాష్ట్ర ఉద్యానశాఖ ఓ నిర్ణయం తీసుకుంది. ఫోన్‌లో ఆర్డర్‌ తీసుకుని వినియోగదారులకు మామిడి పండ్లను సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఎలాంటి కెమికల్స్ కలపకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మాగబెట్టిన 5 కిలోల బంగినపల్లి మామిడిపండ్లను రూ. 350కే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు 79977 24925, 79977 24944 నంబర్లలో ఫోన్‌చేసి ఆర్డర్‌ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా కూడా డబ్బులను చెల్లించవచ్చని, 79977 24925 నంబర్‌లో గూగుల్‌పే చేసి, పిన్‌కోడ్‌ సహా పూర్తి చిరునామాను మెసేజ్‌ చేయాలని ఉద్యానశాఖ సంచాలకుడు ఎల్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంతే కాదు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదులను చెల్లించాలనుకునే వారు ఆంధ్రాబ్యాంక్‌ గగన్‌మహల్‌ బ్రాంచ్‌, అకౌంట్‌ నంబరు 013910100082888, ఐఎఫ్‌సీ కోడ్‌ ఏఎన్‌డీబీ0000139లో చెల్లించాలన్నారు. అలా ఆర్డర్ చేసిన వినియోగదారులకు నాలుగైదురోజుల్లోనే పండ్లు చేరేలా చూస్తామన్నారు.


Tags:    

Similar News