Bandla Ganesh: మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు
Bandla Ganesh: విద్యార్థుల రక్తాన్ని పీల్చి మల్లారెడ్డి ఫీజులు వసూలు చేస్తున్నాడు
Bandla Ganesh: మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు
Bandla Ganesh: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు నెలల పరిపాలన అద్భుతంగా ఉందని సినీ నిర్మాత బండ్ల గణేష్ కొనియాడారు.. గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూశారని అన్నారాయన.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని చెప్పారాయన... మాజీ మంత్రి మల్లారెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి మల్లారెడ్డి ఫీజులు వసూలు చేస్తున్నాడని తీవ్రపదజాలంతో ఆరోపించారాయన.