ఉద్యోగులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.. టీఎన్జీవో నేతల డిమాండ్..
TNGO Leaders: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.. టీఎన్జీవో నేతల డిమాండ్..
TNGO Leaders: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీలు చేస్తున్నారన్న బండి వ్యాఖ్యలను రాజేందర్ ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహిళా ఉద్యోగులపైనా బండి సంజయ్ విమర్శలు సరికాదన్నారు. ఓటు వేయమని మేము ఎవరినీ అడగలేదన్నారు రాజేందర్. సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు సంజయ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులు వ్యక్తులు కాదు శక్తులని తెలిపారు. బేషరతుగా బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రేపట్నుంచి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడతామమని హెచ్చరించారు.