Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్
Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు..
Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా అని నిలదీశారు. అయితే కేటీఆర్‌కు సైతం నోటీసులు పంపుతా అన్నారు బండి సంజయ్. తనను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చా అన్నారు. మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అన్నారు బండి సంజయ్.
కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.