Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.

Update: 2025-11-25 08:56 GMT

Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో చెక్ డ్యాంల కూలిపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడంతోనే తనుగుల-గుంపుల మధ్య చెక్ డ్యాం కూలిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కు చెందిన కాంట్రాక్టర్లే చెక్ డ్యాంలు నిర్మించారు. ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లయితే చెక్ డ్యాంలు కూలకపోయేవని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఆనాడు కమీషన్లకు కక్కర్తిపడి నాణ్యతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని తనుగుల చెక్ డ్యాం దగ్గరకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉటే వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News