Bandi Sanjay: ఎకరానికి 10వేల సాయం ఏ మూలకు సరిపోతుంది..?
Bandi Sanjay: 8ఏళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎందుకు సాయం చేయలేదు..?
Bandi Sanjay: ఎకరానికి 10వేల సాయం ఏ మూలకు సరిపోతుంది..?
Bandi Sanjay: పంటనష్టం జరిగిన జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. కేంద్రాన్ని తిట్టడం తప్ప.. రైతులకు సీఎం కేసీఆర్ చేసిందేమీలేదని అన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేయకుండా.. రైతుల నోట్లో మట్టి కొట్టిన సీఎం కేసీఆర్‌కు కేంద్రం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 8ఏళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. గతంలో ఏనాడైనా పంట నష్టపోయిన రైతులను పలకరించారా..? అంటూ నిలదీశారు. కేసీఆర్ అహంకారాన్ని అణచివేసి.. ఫామ్‌హౌస్ నుంచి పొలం దాకా తీసుకువచ్చిన ఘనత బీజేపీదన్నారు బండి సంజయ్. ఎకరానికి 10వేల సాయం ఏ మూలకు సరిపోవన్న బండి.. తక్షణమే సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.