Balka Suman: దేశంలో మోడీ పాలనకు కాలం చెల్లింది..
Balka Suman: దేశంలో మోడీ పాలనకు నూకలు చెల్లాయని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కా సుమన్...
Balka Suman: దేశంలో మోడీ పాలనకు కాలం చెల్లింది..
Balka Suman: దేశంలో మోడీ పాలనకు నూకలు చెల్లాయని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కా సుమన్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలో పరిస్థితులు దయనీయంగా ఉంటే వాటిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ప్రజల్లోనూ మోడీ పాలనపై విసుగొచ్చిందని ప్రస్తావించారు. ఈడీని ఉసిగొల్పడం మీద బీజేపీ దృష్టిపెట్టిందని.. మోడీకి రైతుల ఉసురు తగులుతుందని బాల్క సుమన్ అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని అన్నారు. దేశ యువత మోడీ హటావో భారత్ బచావో నినాదం అందుకుందని అన్నారు.