Babli Project: తెరుచుకున్న బాబ్లీ గేట్లు
Babli Project: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం తెరిచారు.

Babli Project: తెరుచుకున్న బాబ్లీ గేట్లు
Babli Project: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం తెరిచారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) పర్యవేక్షణలో తెలంగాణ-మహారాష్ట్ర అధికారుల సమక్షంలో మొత్తం 14 గేట్లను ఎత్తారు.
ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని అధికారులు వెల్లడించారు. గేట్లు ఎత్తడంతో గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు నది పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
గేట్లు ఎత్తిన నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంత రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహం పెరగడం వల్ల సాగు నీటి సరఫరా మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మత్స్యకారులకు చేపల వేటకు మరింత అనుకూల వాతావరణం లభించనుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతి సంవత్సరం జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి, అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉంచాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే ప్రకారం అధికారుల సమక్షంలో గేట్లను ఎత్తారు.