Azadi Ka Amrut Mahotsav: తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు

Azadi Ka Amrut Mahotsav:స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు

Update: 2021-03-12 06:28 GMT
కేసీఆర్

Azadi Ka Amrut Mahotsav : దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించుకుంది. 75 వారాల పాటు ఈ వేడుకలను జరుపుకోనున్నట్టు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గుజరాత్‌లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు మోడీ. ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

ప్రధాని మోడీ పిలుపుతో.. హైదరాబాద్‌లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్‌ మార్చ్‌, గాలిలో బెలూన్స్‌ ఎగురవేశారు సీఎం కేసీఆర్‌.75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. హింసా మార్గంలో స్వాత్రంత్ర్యం సాధించుకున్నామని గుర్తు చేశారు.. గాంధీజీ సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అలాగే75వ స్వాతంత్ర్య ఉత్సవాలకు గుర్తుగా సంజీవయ్య పార్క్‌లో ఉన్న జాతీయ పతాకం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని కేసీఆర్‌ సూచించారు. ఈ వేడుక‌ల్లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

గురు‌వారం బీఆర్కే భవ‌న్‌తోపాటు ప్రభుత్వ భవ‌నాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ మహోత్సవాలకు 25 కోట్లను కేటాయించింది తెలంగాణ సర్కార్‌. తెలంగాణ గవ‌ర్నర్‌ తమి‌ళిసై వరం‌గ‌ల్‌లో జాతీయ జెండాను ఆవి‌ష్క‌రించి ఉత్స‌వా‌లను ప్రారం‌భించారు. 

Tags:    

Similar News