మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న పసుపు రైతులు

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత డిమాండ్ల సాధనకు సిద్ధమవుతున్నారు.

Update: 2019-08-30 04:02 GMT

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత డిమాండ్ల సాధనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఆర్మూర్‌లో సమావేశమైన పసుపు ఎర్రజొన్న రైతుల ఐక్యకార్యాచరణ కమిటీ ఉద్యమరూపాలపై చర్చించింది. దీనిపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రజాప్రతినిధులందరిని కలిసి పసుపు బోర్డు ఏర్పాటుపై వినతిపత్రాలు ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమబాట పట్టాలని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు.

పసుపు పంటను ఆహార ధాన్యాల పంటగా గుర్తించడంతో పాటు కనీస మద్దతు ధర 15వేలు ప్రకటించాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్న పంటకు కేసీఆర్ ప్రకటించిన బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎర్రజొన్నలకు 3500 మద్దతు ధర ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో ప్రజాప్రతినిధులు, అధికారులను కలువనున్నారు. రైతుల నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రజాప్రతినిధులు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పసుపు బోర్డు కోసం గణేష్ ఉత్సవాల అనంతరం గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశలో రైతులు సమాయత్తం అవుతున్నారు.

Tags:    

Similar News