AP Curfew: ఏపీలో కర్ఫ్యూ మరింత కఠినం..

AP Curfew: మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే మాత్రమే ఏపీలోకి అనుమతించనున్నారు.

Update: 2021-05-11 09:05 GMT

కర్ఫ్యూ నిబంధనలు (ఫైల్ ఇమేజ్)

AP Curfew: నేటి నుంచి కర్ఫ్యూను మరింత కఠినం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రజులు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇళ్లకు పరిమితం అవ్వాల్సిందే.. ఏదైనా అత్యవసరం అనుకుంటే.. అనుమతి తీసుకోవాల్సిందే.. అనుమతి పత్రం, లేదా గుర్తింపు కార్డు లేకుండా కనిపిస్తే భారీగా కేసులు నమోదు చేస్తామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీలో కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతున్నా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతూ భయపెడుతున్నాయి. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీస్తున్న సీఎం జగన్.. అధికారులకు పలు సూచలను చేస్తున్నారు. కర్ఫ్యూని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

అత్యవసర పరిస్థుల్లోనూ బయటకు వెళ్లాలి అనుకునే వారు.. కర్ఫ్యూ సమయంలో చికిత్స అవసరాల కోసం, ఇతర అత్యసవర పరిస్థితులు ఉన్నాయి అనుకునే వారు. అంత్యక్రియలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక పాసులు ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధి..ఈ వెడ్ సైట్లో వెళ్లి పాసులు తీసుకోవచ్చని చెబుతున్నారు. http://bit.ly/2RIL0eh లేదా http://appolice.gov.in ల్లో పాసులు పొందంచని సూచించారు. ఆ పాసులు పొందడం కూడా చాలా సులభమని అన్నారు.

ఈ పాస్ కావాల్సిన వారు ముందుగా citizen.appolice.gov.in వెబ్‌సైట్లో apply ePass for movement during lockdown అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే 'ఈ' దరఖాస్తు కనిపిస్తుంది. దరఖాస్తుదారు పేరు, ఫోన్‌ నంబరు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం, ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి.ఏ కేటగిరీ కింద ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్‌ వద్ద టిక్‌ మార్క్‌ పెట్టాలి. రాష్ట్రంలోనే ప్రయాణించాలనుకుంటున్నారా? బయటకు వెళ్లాలనుకుంటున్నారా? బయటి రాష్ట్రం నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. సంబంధిత బాక్స్ వద్ద టిక్ చేయాలి.

సొంత వాహనాల్లో వస్తారా? లేక ప్రజారవాణాను ఉపయోగిస్తున్నారా?దరఖాస్తులో వివరించాలి. ఎంతమంది ప్రయాణం చేయాలనుకుంటన్నారో, అందరి పేర్లు, ఫోన్‌ నంబర్లు, గుర్తింపు కార్డు నెంబర్లు ఇవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డుల్లో ఏదో ఒక దాన్ని ధ్రువీకరణపత్రంగా చూపించాలి. అలాగే అనారోగ్య, కరోనా లక్షణాలు ఉన్నాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలి. గతంలో క్వారంటైన్‌లో ఉన్నారా? లేదా? తెలియజేయాలి. అన్ని సరైన వివరాలు ఉంటేనే ఇతర రాష్ట్రాల వారిని ఏపీలోకి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News