పొలం దున్నుతుండగా బయటపడ్డ వెండి నాణేలు..

చాలా మంది గుప్త నిధులకోసం తవ్వకాలు చేపడుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి వ్యవసాయం సాగు కోసం పొలాన్ని దున్నుతున్నప్పుడు అతనికి నిధి లభ్యం అయింది.

Update: 2020-04-02 13:43 GMT
Silver Coins

చాలా మంది గుప్త నిధులకోసం తవ్వకాలు చేపడుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి వ్యవసాయం సాగు కోసం పొలాన్ని దున్నుతున్నప్పుడు అతనికి నిధి లభ్యం అయింది. ఆ నిదిలో పురాతన కాలం నాటి వెండి నాలేలు ఉండడంతో వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఆ పొలం యజమానితో సహా కొంతమంది ఇంటికి పట్టుకెళ్లారు. ఈ విషయాన్ని ఎంత గుట్టు చప్పుడ కాకుండా ఉంచుదామనుకున్నా ఆ నోటా, ఈనోటా ఆ విషయం కాస్త ఊరందరికీ తెలిసి, ప్రభుత్వ అధికారులకు తెలిసింది. ఇంకేముందు ఆ నాణేలను అధికారులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అతని పొలాన్ని సోమవారం ఉదయం దున్నుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి పొలంలో వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన వెంకట్రామిరెడ్డి తన పొలంలో ఉన్న మరికొందరు ఆ నాణేలను గుట్టుగా పంచుకుని ఎక్కడి వారు అక్కడికి వెల్లిపోయారు.

అయితే ఈ విషయం గ్రామంలోని కొంత మందికి తెలవడంతో ఆ నోటా ఈ నోటా అది కాస్త రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నాణేలు బయటపడిన విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఇంకేముంది వెంకట్రామిరెడ్డి నుంచి, ఇతరుల నుంచి మొత్తం 141 వెండి నాణేలను స్వాధీనం చేసుకుని వెల్లిపోయారు.

Tags:    

Similar News