Hyderabad: మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
Hyderabad: డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవంటున్న సెంట్రల్ జోన్ డీసీపీ శరత్‌పవార్
Hyderabad: మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
Hyderabad: న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షలు విలువచేసే 100 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు పోలీసులు. గ్రాము 2వేలకు కొని హైదరాబాద్‌లో 7వేలకు ముఠా సభ్యులు అమ్ముతున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో ఒక నైజీరియన్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో.. నైజీరియన్ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు. మరోవైపు.. డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్‌పవార్.