Betting Apps Case: తెలంగాణ హైకోర్ట్‌ను ఆశ్రయించిన యాంకర్ శ్యామల
Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుకు ఉచ్చు బిగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ పై చిన్నపాటి యుద్ధం కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాక్టర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు.
కాగా యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై F.I.R నమోదైంది. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్ట్‌లో శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. శ్యామల పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.