అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Update: 2020-03-08 04:18 GMT
FIle Photo

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోమిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి, ప్రేమలతల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్‌(24), అదే పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతిరావు కుమార్తె అమృత పదోతరగతి నుంచి స్నేహితులు. జనవరిలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటొంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత వరుడి తల్లిదండ్రులు మిర్యాలగూడలో వివాహ విందు ఏర్పాటు చేయగా... అమ్మాయి తరఫు బంధువులు హాజరుకాలేదు. ఆసమయంలో అమృత గర్భిణి. దీంతో సెప్టెంబరు 14న మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను తీసుకుని ప్రణయ్‌, ఆయన తల్లి ఆసుపత్రికి వచ్చారు.

అనంతరం తిరిగి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్దకు ప్రణయ్‌ చేరుకోగానే ఆసుపత్రిలోనే మాటు వేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. దీంతో ప్రణయ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యకు అమ్మాయి తండ్రి మారుతిరావే కారణమని భావించిన పోలీసులు ఏ1గా అతడిని, ఏ2గా అమృత బాబాయి శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. 

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తన కుమార్తె, ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుందని.. ప్రణయ్ ను హత్య చేయించాడనే ఆరోపణలను ఎదుర్కోంటున్నాడు. దీంతో ప్రణయ్ కేసులో మారుతిరావు నిందితుడిగా ఉన్నారు. అయితే, ఇప్పుడు తాజాగా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల క్రితం మారుతీరావు షెడ్ లో అనుమానస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.

అప్పటికే ప్రయణ్ హత్య కేసులో మరుతీరావు నిందితుడిగా ఉన్నారు. దీంతో పోలీసుల ఒత్తిడితోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. కిరాయి హంతకులతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించారని మారుతీరావు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.

పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. తర్వాత కూతురు అమృతకు ఇంటికి రమ్మని మారుతీరావు వేధించడంతో అమృత పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో మిర్యాలగూడ పోలీసులు మారుతీరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూతురు దూరమయ్యిందని మారుతీరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యినట్టు తెలుస్తోంది.


Full View


Tags:    

Similar News