హైదరాబాద్‌లో బండి సంజయ్‌తో అమిత్ షా భేటీ
*బండి సంజయ్‌తో రెండోసారి భేటీపై సర్వత్రా చర్చ
హైదరాబాద్‌లో బండి సంజయ్‌తో అమిత్ షా భేటీ
Amit Shah: తెలంగాణ విమోచన దినోత్వవం కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బండి సంజయ్ తో సమావేశం అయ్యారు. గత రాత్రే బండితో భేటీ అయిన అమిత్ షా.. ఇవాళ మరోసారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో.. అమిత్ షా ముఖాముఖి అయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై తెలుసుకుంటారని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ అమిత్ షా మాత్రం..ఒక్క బండి సంజయ్ మాత్రమే రెండోసారి సమావేశం అయ్యారు. ఇటీవల 119నియోజవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించారు. వారు హైకమాండ్ కు ఇచ్చిన నివేదికపై బండి సంజయ్‌తో అమిత్ షా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.