అంబర్‌పేట ఎస్సై భానుప్రకాష్ సర్వీస్ గన్ మిస్సింగ్… సస్పెన్షన్, FIRతో కలకలం
వివాదాస్పదంగా అంబర్‌పేట ఎస్సై భానుప్రకాష్ తీరు ఎస్సై భానుప్రకాష్‌రెడ్డి సర్వీస్ గన్ మిస్సింగ్ SIని సస్పెండ్ చేసి, FIR నమోదు చేసిన అంబర్‌పేట్ పోలీసులు
అంబర్‌పేట ఎస్సై భానుప్రకాష్ సర్వీస్ గన్ మిస్సింగ్… సస్పెన్షన్, FIRతో కలకలం
హైదరాబాద్ అంబర్‌పేట ఎస్సై భానుప్రకాష్ తీరు వివాదాస్పదంగా మారింది. ఎస్సై భానుప్రకాష్‌రెడ్డి గన్ మిస్సైంది. SIని సస్పెండ్ చేసి అంబర్‌పేట్ పోలీసులు..FIR నమోదు చేశారు. ఇటీవల అంబర్‌పేట PS పరిధిలో అధికారుల ఇన్‌స్పెక్షన్ చేశారు. అందులో భాగంగా రివాల్వర్‌ను తీసుకురావాలని SIని ఆదేశించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో భానుపై దర్యాప్తు చేపట్టారు. ఓ కేసులో రికవరీ అయిన బంగారాన్ని కూడా భాను అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక కారణాలతో SI రివాల్వర్ అమ్ముకుని ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు.