'కేసీఆర్‌ ఉన్న గడ్డ మీద పుట్టడం నా అదృష్టం': ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరినీ ఒకే దృష్టితో చూస్తోందని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు.

Update: 2020-03-16 13:45 GMT
Akbaruddin Owaisi Speech in Assembly

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరినీ ఒకే దృష్టితో చూస్తోందని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్‌ ఉన్న గడ్డమీద నేను పుట్టడం నా అదృష్టం ఆని ఆయన అన్నారు. 'సీఏఏ కేవలం ముస్లింలకే కాదు. దేశంలోని పేదలందరికీ వ్యతిరేకం. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌) కు చట్టబద్ధత లేదని' అక్బరుద్దీన్‌ తెలిపారు.

సీఏఏపై ఇంత ఏ ముఖ్యమంత్రి ఇంత ఖరాకండిగా తీర్మానం చేయలేదని ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కిందన్నారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోంది. ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉందని, దేశ పౌరుడికి పౌరసత్వం పోయి, పౌరుడి కాని వారికి పౌరసత్వం వస్తుందని ఆయన వెల్లడి చేసారు. ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంది. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది.

దేశంలో 50శాతం మందికి సొంత ఇళ్లు లేవని వారికి అద్దె అడ్రస్సే దిక్కని తెలిపారు. దీంతో ఒకే అడ్రస్‌పై రెండు, మూడు కుటుంబాలు ఉంటాయన్నారు. ఎన్‌పీఆర్‌ తర్వాత ఎన్‌ఆర్‌సీ తీసుకురావడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీఆర్‌ తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో దాన్ని వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్‌ఆర్‌సీ ముస్లింలకే కాదు ఎస్సీ, బీసీ, పేద వర్గాల వారికి కూడా వ్యతిరేకమేనన్నారు. దేశంలో 70 శాతం మందికి బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు' అని అక్బరుద్దీన్‌ అన్నారు.

డౌట్‌ఫుల్‌ కేటగిరిలో పూర్తి వివరాలు అందించని వారిని పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి డౌట్‌ఫుల్‌ సిటిజన్స్‌ వెళ్లాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పౌరసత్వంపైన ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసే ప్రొవిజన్‌ పెట్టారని దీనివల్ల బ్లాక్‌మెయిలింగ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.


Tags:    

Similar News