Niranjan Reddy: వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి

Niranjan Reddy: భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలి

Update: 2023-08-30 10:17 GMT

Niranjan Reddy: వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి 

Niranjan Reddy: ఉన్నత చదువులు చదివి అమెరికాలో అత్యంత అధునాతన రీతిలో... వేల ఎకరాల్లో లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయం చేస్తున్న రైతులు అభినందనీయులన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 1950లో కెన్నెత్, లూయిస్ జంట మొదలుపెట్టిన ఈ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు వారి మునిమనవలు నడిపిస్తుండటం విశేషమన్నారాయన.. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయన్నారు. భారీ కమతాలు, మానవ వనరుల కొరతతో పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు మంత్రి సింగిరెడ్డి. 

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి అన్నారు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారాయన... ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందజేయడమే తన అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి.

Tags:    

Similar News