Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మద్యం స్వాధీనం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుడిహత్నూర్ లని రాజీవ్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో మద్యం అక్రమంగా నిల్వఉంచారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మద్యం తీసుకు నిల్వ చేశారని గుర్తించారు. సుమారు 60 వేల రూపాయాల విలువైన మద్యం సీజ్ చేశారు. ఎవరైనా ఓటర్లను మభ్యపెట్టి మందు, నగదు పంచినట్లుయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.