Akkineni Nagarjuna: పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతం
Akkineni Nagarjuna: భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో సినీ హీరో నాగార్జున పాల్గొన్నారు.
Akkineni Nagarjuna: భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో సినీ హీరో నాగార్జున పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన ప్రాంతం అని నాగార్జున అభివర్ణించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీరంగం అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని నాగార్జున ప్రశంసించారు. తెలంగాణకు మరిన్ని స్టూడియోలు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు అని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో స్టూడియో పెట్టడానికి బాలీవుడ్ కూడా ముందుకొచ్చిందని నాగార్జున తెలిపారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఇక్కడ పెద్ద నిర్మాణాలను చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ గురించి నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఈ సమ్మిట్‌లో ప్రముఖంగా నిలిచాయి.