Sangareddy: యువకుడు మృతి చెంది 14 రోజులు.. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వని పోలీసులు..

Sangareddy: 108లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడు

Update: 2023-01-06 07:13 GMT

యువకుడు మృతి చెంది 14 రోజులు.. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వని పోలీసులు..

Sangareddy: సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం సుల్తాన్ పూర్ లో గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిన్నా అనే యువకుడు మృతి చెందాడు. క్రిష్ణ పూర్ గ్రామానికి చెందిన చిన్న అనే యువకుడ్ని గత నెల 18న సుల్తాన్ పూర్ లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నా తీవ్రంగా గాయపడ్డాడు పోలీసులు అతన్ని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నా చికిత్సపొందుతూ గత నెల 23న మృతి చెందాడు. యువకుడు మృతి చెంది 14 రోజులు అవుతున్నా బంధువులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో బంధువులు మృతుదేహం. వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి వద్ద ఆధార్ కార్డ్ ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డిఎస్పీ రవేందర్ రెడ్డి దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మృతుడి బంధువులకు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News