Nirmal: పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి

Nirmal: మృతుడు మహారాష్ట్ర శివుని గ్రామానికి చెందిన ముత్యంగా గుర్తింపు

Update: 2023-02-26 06:42 GMT

Nirmal: పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి

Nirmal: నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని పరిశీలించగా.. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యంగా గుర్తించారు.

Tags:    

Similar News