ప్రేమ వ్యవహారంలో బెదిరింపు కాల్.. యువకుడి ఆత్మహత్య
Wanaparthy: బ్రతికి ఉన్న కూతురు చనిపోయిందని బెదిరించడంతోనే..
ప్రేమ వ్యవహారంలో బెదిరింపు కాల్.. యువకుడి ఆత్మహత్య
Wanaparthy: వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని మొట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో అ యువకుడికి శాపంగా మారింది. నా కూతురు నీ వల్లే చనిపోయిందని యువతి తండ్రి యువకుడికి ఫోన్ చేసి బెదిరించాడు..దీంతో భయపడ్డ యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రతికి ఉన్న కూతురు చనిపోయిందని బెదిరించడంతోనే తన కుమారుడు చనిపోయాడని యువకుడి తండ్రి ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన యువతి తండ్రిని కఠినంగా శిక్షించాలని యువకుడి తండ్రి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.