Hyderabad: చర్లపల్లిలో దారుణం.. బాలుడి పైకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Hyderabad: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2023-12-15 13:45 GMT

Hyderabad: చర్లపల్లిలో దారుణం.. బాలుడి పైకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Hyderabad: హైదరాబాద్‌ చర్లపల్లి బీఎన్‌రెడ్డినగర్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల ప్రణయ్‌ అనే బాలుడి పైకి స్కూల్‌ బస్సు దూసుకెళ్లింది. అమ్మమ్మతో కలిసి అక్కను, అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News