Hyderabad: చట్నీ ఎక్కువైందని అలిగిన భర్త.. ఉరేసుకున్న భార్య

Hyderabad: బంజారాహిల్స్‌లో ఘటన

Update: 2024-01-09 02:17 GMT

Hyderabad: చట్నీ ఎక్కువైందని అలిగిన భర్త.. ఉరేసుకున్న భార్య

Hyderabad: చట్నీ విషయంలో తలెత్తిన గొడవ భార్య బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ రాణా పరిధిలో జరిగింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందనను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వద్ద డ్రైవర్‌. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియోకాల్స్‌ చేసింది. అతడు స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్‌ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె విగతజీవిగా మారింది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తామన్నారు.

Tags:    

Similar News