మొక్కే కదా అని పికేశాడు... ముప్పైవేల ఫైన్ వేశారు

Update: 2019-10-02 10:54 GMT

హరితాహారం కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీలైతే ప్రతిఒక్కరు ఒక మొక్కను నాటి మరొకరిని మొక్కను నాటేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. నాటిన మొక్కలని సంరక్షించే భాద్యతను అధికారులకు అప్పజెప్పింది. ఎన్ని చర్యలను తీసుకున్నా మొక్కలు బతకడం లేదు. కొన్ని చోట్ల స్వార్ధంతో కొందరు వాటిని విరిచేస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం మేకలు, పశువులు మొక్కలను మేస్తున్నాయి. ఇలాంటివి జరిగితే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సిద్ధిపేటలోని బృందావన కాలనీ ఎదురుగా ఉన్న హరితహారం చెట్లను అదే కాలనీకి చెందిన బాలయ్య అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. దీనితో అధికారులు అతనిపై ఫైర్ అయ్యారు. అతని చేత ముప్పై వేల ఫైన్ కట్టించి, తిరిగి మొక్కలను నాటించి, దాని సంరక్షణ భాద్యతను అప్పజెప్పారు. 

Tags:    

Similar News