CWC Meeting: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహణ
CWC Meeting: కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత తొలి సమావేశం
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహణ
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. CWC సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న CWC సమావేశాన్ని నిర్వహించాలని ఏఐసీసీ భావిస్తోంది. సెప్టెంబర్ 17న బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. CWC కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత, తొలి భేటీ హైదరాబాద్ లో జరగనుంది. తర్వలో తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో.. ఈ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా ఎంచుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా పలు కార్యక్రమాల రూపొంచాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగానే, CWC సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది.