Suicide: ప్రేమ పేరుతో వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Suicide: నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ విద్యార్థిని సాయిష్మ మృతి

Update: 2023-03-20 09:49 GMT

Suicide: ప్రేమ పేరుతో వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Suicide: ప్రేమ పేరుతో వేధింపులకు ఓ విద్యార్థి బలైంది. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని సాయిష్మ మృతి చెందింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడికి చెందిన సాయిష్మను.. వినయ్‌కుమార్‌ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తనను ప్రేమించి పెళ్లిచేసుకోకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు యువతి తెలిపింది. మనస్థాపంతో ఈనెల 18న పురుగుల మందు తాగిన సాయిష్మను.. చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. అయితే సాయిష్మ ఇవాళ మృతి చెందింది. సాయిష్మ మృతికి వినయ్‌ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News