Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం

Hyderabad: మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు

Update: 2023-12-25 12:05 GMT

Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం

Hyderabad: హైదరాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది. నగరంలోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సలీమ్ నగర్‌లో నివసిస్తున్న వరాహమూర్తి, దుర్గ దంపతులు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. వృత్తి రీత్యా వరాహమూర్తి గోల్డ్ స్మిత్. ముగ్గురు కూతుర్లకు పెళ్లిళ్లు చేశారు. మొహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాపులో తండ్రి కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు.

సుమారు 50 లక్షల వరకు అప్పులు చేయడంతో తండ్రీ కొడుకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తున్నారు. వడ్డీలు కట్టీ కట్టీ మరింత అప్పుల లోతులోకి కూరుకుపోయిన ఆ కుటుంబం... ప్రత్యామ్నాయ మార్గం లేక చనిపోయేందుకు సిద్ధమయ్యారు. మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి, మా చావుకు ఎవరు బాధ్యులు కారు అంటూ ఈ నెల 20వ తేదీన ఓ పేపర్‌పై రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి, ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వరాహమూర్తి కుమార్తె చాముండేశ్వరి మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News