Adilabad: పితృమాసం భోజనాలు తిని.. 70 మందికి అస్వస్థత
Adilabad: ఆస్పత్రితో పాటు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు, కొనసాగుతన్న చికిత్స
Adilabad: పితృమాసం భోజనాలు తిని.. 70 మందికి అస్వస్థత
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లిలో కలుషిత ఆహారం తిని దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన ముండే బలవంత్.. పితృ మాసం సందర్భంగా తన ఇంట్లో నిన్న రాత్రి స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు తిన్న కొందరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఉదయం సైతం మరికొందరు ఇలాగే ఇబ్బంది పడటంతో 108కు సమాచారం అందించారు. 20 మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు, మరికొందరిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి ఐదు అంబులెన్స్‌ల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ సేవలందిస్తున్నారు.