TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,801 కేసులు, 32 మంది మృతి
TS Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నేడు 4801 కేసులు నమోదయ్యాయి (ఫొటో ట్విట్టర్)
TS Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 75,289 నమూనాలను పరీక్షించారు. ఇందులో 4వేల801 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,06,988 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా రాష్ట్రంలో 32 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 2,803కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 7వేల430 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 756 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.