22 Traffic Challans: ఓ యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు

22 Traffic Challans: ఓయువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏకంగా 22 చలాన్లు పడ్డాయి.

Update: 2021-06-16 07:07 GMT

22 Traffic Challans Against a Young Woman

Hyderabad: నగరంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పెద్ద కసరత్తే చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పోలీసులే అవాక్కయ్యేలా ఓ యువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. అయితే నిజాంపేట వద్ద ఓ యువతి 22 సార్లు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కింది. సదురు యువతికి ఏకంగా దాదాపు రూ. 9 వేల పెనాల్టీలు వేశారు. కొందరు ద్విచక్ర వాహనాలపై వివిధ రకాలు ఫీట్లు చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. కానీ ఈ యువతి ఎలాంటి భయం, జంకూ లేకుండా ట్రాఫిక్ పోలీసుల ఫొటోలకు ఫోజులిచ్చింది.

కూకట్పల్లి, నిజాంపేట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రెండు రోజులు కిందట బైక్ పై సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళుతున్న యువతి కనిపించింది. వెంటనే కానిస్టేబుల్ ఫొటో తీయగా... చలాన్ నమోదైంది. వరుసగా అదే విధంగా రోజూ వాహనం నడపగా పోలీసులు చలాన్లు విధించారు. ఆమె ఉల్లంఘనలపై దృష్టి పెట్టిన పోలీసులు వాహనంపై 22 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా రూ. 9,070 కట్టించుకుని పంపించారు.

Tags:    

Similar News