దీపావళి వేడుకల్లో అపశృతి.. కాలిన గాయాలతో సరోజిని ఆస్పత్రిలో 10 మందికి చికిత్స
Hyderabad: చీకటి నింపిన దీపావళి సంబరాలు
దీపావళి వేడుకల్లో అపశృతి.. కాలిన గాయాలతో సరోజిని ఆస్పత్రిలో 10 మందికి చికిత్స
Hyderabad: హైదరాబాద్ పరిసరాల్లో వెలుగుల్ని విరజిమ్మిన దీపావళి వేడుకలు పలువురికి చీకటినింపాయి. బాణాసంచా, టపాకాయలు పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించని చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బాణాసంచా సమయంలో ముఖంపై కాలిన గాయాలతో కంటిచూపుపై ప్రభావం చూపాయి. దీపావళి వేడుకల్లో ఆకాశాన వెలుగులు విరజిమ్మే బాణాసంచాను తిలకిస్తున్న చాలామంది ప్రమాదానికి గురయ్యారు.
గాయపడినవారు చికిత్స నిమిత్తం హైదరాబాద్ సరోజిని ఆస్పత్రిలో చేరారు. వైద్యులు, సిబ్బంది గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి కంటిచూపు దెబ్బతినకుండా ప్రయత్నాలు చేశారు. వయసుతో సంబంధంలేకుండా చిన్నారులనుంచి , వృద్ధులు సైతం జాగ్రత్తలు పాటించకుండా బాణాసంచా, టపాకాయలు పేల్చి గాయపడ్డారని సమాచారం. హైదరాబాద్ నగర పరిసరాల్లో వేర్వేరు చోట్ల గాయపడి కంటి చూపుపై ప్రభావం చూపుతోందని 10మంది సరోజిని ఆస్పత్రిలోచేరి చికిత్స పొందుతున్నారు.