ఒక నియంత చేసిన ప్రకటనలా ఉంది : భట్టి విక్రమార్క

ఆర్టీసీ కార్మికులను తొలగించడం దేశ చరిత్రలో లేదు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి ప్రభత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉంది- భట్టి విక్రమార్క

Update: 2019-10-07 12:35 GMT

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. అహంకారంతో కూడిన ఒక నియంత చేసిన ప్రకటనలా ఉందని భట్టి అన్నారు. ఆర్టీసీ అనేది ప్రజల జీవితాలతో మమేకమైన సంస్థను ప్రజలంతా కాపాడుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. డీజిల్‌ ధరల వల్ల 4 వందల కోట్లు ఆర్టీసీ నష్టపోతుందన్నారు. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న ఆర్టీసీ కేసీఆర్‌ పాలన వల్లే కుదేలవుతోందని ఆరోపించారు భట్టి విక్రమార్క.

Full View

Tags:    

Similar News