అసెంబ్లీలో కంటతడి పెట్టిన ఆలేరు ఎమ్మెల్యే సునీత !

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటి పర్యంతమయ్యారు.తన తండ్రి కూడా 14 ఏళ్లు డయాలసిస్ పెషెంట్‌గా ఉండటం వల్ల ఆర్థికంగా తామెంత చితికిపోయినమో, మేము ఎంత బాధపడ్డమో తనకు ప్రత్యక్షంగా తెలుసంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Update: 2019-09-20 06:34 GMT

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఎమ్మెల్యే డయాలసిస్ వ్యాధిగ్రస్తుల బాధలను వివరిస్తూ ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా గొంగడి సునీత మాట్లాడుతూ.. డయాలసిస్ పేషెంట్ల దీన పరిస్థితిని వివరించారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా ఫించన్ అందించాలని కోరారు. ముఖ‌్యంగా ఈ వ్యాధిభారిన పడితే ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుందన్నారు. కుటుంబ పెద్ద అతను ఉపాధి కోల్పోవడంతోపాటు.. కుటుంబం అంతా మానసికంగా, ఆర్థికంగా నష్టపోతుందన్నారు. తన తండ్రి కూడా 14 ఏళ్లు డయాలసిస్ పెషెంట్‌గా ఉండటం వల్ల ఆర్థికంగా తామెంత చితికిపోయినమో, మేము ఎంత బాధపడ్డమో తనకు ప్రత్యక్షంగా తెలుసంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  

Full View

Tags:    

Similar News