Xiaomi 15 5G: పవర్ ఫుల్ ఫీచర్స్‌తో షియోమి కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా..?
Xiaomi 15 5G: ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'Xiaomi 15' మొబైల్ భారత్‌లో విడుదలైంది.
Xiaomi 15 5G: ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'Xiaomi 15' మొబైల్ భారత్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌ను తొలిసారిగా చైనాలో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి, భారతీయ వినియోగదారులు దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు Xiaomi 15ని దేశంలో అధికారికంగా ప్రారంభించారు. ఫోన్ ప్రీమియం లుక్, అద్భుతమైన ఫీచర్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Xiaomi 15 5G Price
షియోమి 15 5జీ ఫోన్ సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ అయింది. మీరు ఈ ఫోన్‌ను 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఆర్డర్ చేయచ్చు. 999 యూరోల ధరతో ప్రపంచ మార్కెట్‌లో విడుదలైంది. భారతీయ కరెన్సీ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ. 90,500గా ఉంది. మార్చి 11 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ భారతీయ ధరను ప్రకటించనుంది.
Xiaomi 15 5G Features And Specifications
షియోమి 15 5Gజీ మొబైల్‌లో 6.36-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2670 × 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ బెజెల్స్ మునుపటి మోడల్ కంటే కొంచెం సన్నగా ఉన్నాయి.
కొత్త షియోమి 15 ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ ఫోన్ పనితీరును 45శాతం వరకు పెంచుతుంది. అలానే ఈ మొబైల్‌లో 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది.
షియోమి 15 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమెరా ఉంది. ఇది ట్రిపుల్ లైకా కెమెరా సెటప్. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సా,సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 5,240mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 90W వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ అందించారు.