Recharge Plans: రీఛార్జ్ ప్లాన్స్‌ 28, 56, 84 రోజులే ఎందుకు ఉంటున్నాయి ? అసలు నిజం ఇదే!

Recharge Plans: ఈ కంపెనీలు ప్రిపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండు రకాల ప్లాన్‌లు ఇస్తున్నాయి. వీటిలో కొన్ని ప్లాన్‌ల వాలిడిటీ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు లాగా ఉంటాయి.

Update: 2025-06-21 02:00 GMT

Recharge Plans: రీఛార్జ్ ప్లాన్స్‌ 28, 56, 84 రోజులే ఎందుకు ఉంటున్నాయి ? అసలు నిజం ఇదే!

Recharge Plans: మన ఇండియాలో ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్‌లు పెట్టి, జనాన్ని తమవైపు లాక్కోవడానికి బాగా పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలు ప్రిపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండు రకాల ప్లాన్‌లు ఇస్తున్నాయి. వీటిలో కొన్ని ప్లాన్‌ల వాలిడిటీ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు లాగా ఉంటాయి. ఇది అందరూ గమనించే ఉంటారు. 28 రోజుల బదులు ఒక నెల రోజులు, లేదా 30 రోజుల వాలిడిటీ ప్లాన్‌లు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఈ 28 రోజుల వాలిడిటీ ఎందుకు ఉందో తెలుసా?

టెలికాం కంపెనీలకు 28 రోజుల ప్లాన్ వల్ల లాభం!

ముందు రోజుల్లో 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌లు అరుదుగా ఉండేవి. ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీల ప్లాన్ వాలిడిటీలు దాదాపు ఒకేలా ఉన్నాయి. కేవలం బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రమే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు లాంటి ప్లాన్‌లను ఇస్తోంది. కానీ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి పెద్ద కంపెనీల్లో మాత్రం వేరే రకం రీఛార్జ్ ప్లాన్‌లే ఉన్నాయి. ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే అలవాటు ఉన్న కస్టమర్లకు, 28 రోజుల వాలిడిటీ ప్లానే ఒక ఆప్షన్‌లా మారింది.

ఇక్కడ టెలికాం కంపెనీలకు ఒక పెద్ద లాభం ఉంది. ప్రతీ నెలా కొత్త ప్లాన్ కొనే వాళ్ళు 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌నే తీసుకుంటారు కదా. ఒక నెల పూర్తి అవ్వడానికి ఇంకా 2-3 రోజులు మిగిలి ఉంటాయి. ఇలా మీరు సంవత్సరమంతా 28 రోజుల వాలిడిటీ ప్లాన్ కొంటూ వెళ్తే, దాదాపు అదనంగా 28 రోజులు వస్తాయి. అంటే, ఒక సంవత్సరంలో మీరు 12 సార్లు కాకుండా, 13 సార్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా టెలికాం కంపెనీలు ప్రతి సంవత్సరం ఒక అదనపు రీఛార్జ్ నుండి లాభం పొందుతాయి. అంటే, ఒక నెల రీఛార్జ్ నుండి అదనపు లాభం పొందుతాయన్నమాట.

56, 84 రోజుల ప్లాన్‌ల వెనక కూడా ఇదే లాజిక్!

28 రోజుల లాగే 56 రోజులు, 84 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. 56 రోజుల వాలిడిటీని రెండు నెలల ప్లాన్‌గా అనుకోవచ్చు. అలాగే, మూడు నెలలకు రీఛార్జ్ చేసుకోవాలనుకునే వాళ్ళు 84 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్‌ని ఎంచుకుంటారు. ఇక్కడ కూడా టెలికాం కంపెనీలకు సంవత్సరంలో 26-28 అదనపు రోజులు లాభం దక్కుతుంది.

28 రోజుల ప్లాన్‌ల గురించి ట్రాయ్ (TRAI) ఏమంటోంది?

టెలిఫోన్ కంపెనీలను నియంత్రించే సంస్థ ట్రాయ్ (TRAI), కొంతకాలం క్రితం టెలికాం కంపెనీలకు 28 రోజుల బదులు 30 రోజుల ప్లాన్‌లను ఇవ్వాలని గైడ్‌లైన్స్ ఇవ్వబోతోందని చెప్పింది. కానీ ఇప్పటివరకు ట్రాయ్ అలాంటి గైడ్‌లైన్స్ ఏమీ ఇవ్వలేదు. అన్ని టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌లు ఇప్పటికీ పాత పద్ధతిలోనే పనిచేస్తున్నాయి.

Tags:    

Similar News