WhatsApp Schedule Calls: వాట్సాప్ యూజర్లకు సూపర్ అప్‌డేట్ – ఇక ఫోన్ కాల్స్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి!
మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం షెడ్యూల్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫ్యామిలీ చాట్స్ అయినా, ఆఫీస్ మీటింగ్స్ అయినా ముందుగానే కాల్ టైమ్ సెట్ చేసుకోవచ్చు.

కాల్ మొదలయ్యే ముందు వాట్సాప్ అందరికీ అలర్ట్ పంపుతుంది. ఈ అప్‌డేట్‌తో పాటు కొత్త ఇన్-కాల్ టూల్స్ కూడా అందించబడ్డాయి, ఇవి కాల్ మధ్యలో ఎమోజీలతో రియాక్ట్ అయ్యే అవకాశాన్ని ఇస్తాయి.
కొత్త ఫీచర్ ముఖ్యాంశాలు:
షెడ్యూల్డ్ కాల్స్: గ్రూప్ కాల్స్‌ను ముందుగా ప్లాన్ చేసి, వ్యక్తులను లేదా మొత్తం గ్రూప్‌ను ఇన్వైట్ చేయవచ్చు. కాల్ ప్రారంభానికి ముందు అందరికీ నోటిఫికేషన్ వస్తుంది.
ఇన్-కాల్ టూల్స్: కాల్‌లో ఎమోజీ రియాక్షన్లు, సిగ్నల్‌లు ఇవ్వడం.
ఇంప్రూవ్డ్ కాల్ మేనేజ్‌మెంట్: రాబోయే కాల్స్ వివరాలు, జాయిన్ అవుతున్న వారి సమాచారం, ఇన్వైట్ లింక్ షేర్ చేసే ఆప్షన్.
ఈ అప్‌డేట్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సపోర్ట్‌తో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రోల్ అవుట్ అవుతోంది, రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయడం ఎలా?
వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి Calls Tabకి వెళ్లండి.
కాల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి.
కాల్ చేయాలనుకునే కాంటాక్ట్ లేదా గ్రూప్ ఎంచుకోండి.
Schedule Call ఆప్షన్‌ను ఎంచుకోండి.
డేట్, టైమ్ సెట్ చేయండి.
వీడియో కాల్ లేదా ఆడియో కాల్ ఎంచుకోండి.
గ్రీన్ బటన్ పై ట్యాప్ చేయండి.
షెడ్యూల్ చేసిన కాల్ Upcoming Calls జాబితాలో కనిపిస్తుంది. జాయిన్ అయ్యే వారికి వాట్సాప్ రిమైండర్ పంపిస్తుంది.