WhatsApp: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమన్న వాట్సప్!

WhatsApp: వాట్సప్ మే 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2021-05-17 12:46 GMT

వాట్సప్ (ఫొటో ట్విట్టర్)

WhatsApp: వాట్సప్ మే 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమని ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలియజేసింది. కాగా, వాట్సాప్ యూజర్లు తమ కొత్త పాలసీని ఓకే చేయకపోతే.. దశల వారిగా వారి అకౌంట్లను ఆపేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో సోమవారం సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

అలాగే ఈ నూతన ప్రైవసీ పాలసీపై కేంద్రం.. వాట్సాప్ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ తెలిపారు. ఇదిలా ఉంటే..వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్‌ శర్మ, పిటిషనర్లు కోరగా.. ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.

Tags:    

Similar News