‍New IT Rules: కొత్త నిబంధనలపై ఢిల్లీ హైకోర్టుకు 'వాట్సప్'

New IT Rules: ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటీ రూల్స్‌ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ ఓ పిటిషన్ వేసింది.

Update: 2021-05-26 16:00 GMT

వాట్సప్ (ఫొటో ట్విట్టర్)

New IT Rules: ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటీ రూల్స్‌ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ ఓ పిటిషన్ వేసింది. మే 26 నుంచి అమల్లోకి వచ్చిన నూతన డిజిటల్ నిబంధనలతో తమ యూజర్ల ప్రైవసీ ప్రొటెక్షన్‌ బహిర్గతం అవుతుందని వాట్సాప్ అంటోంది. దీంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన రూల్స్‌ను నిలిపేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ నిబంధనల్లో ఒకటి భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టుకు విన్నవించింది. దీనివల్ల 40 కోట్ల ఇండియన్ యూజర్ల ప్రైవసీకి భంగం ఏర్పడుతుందని పేర్కొంది.

నూతన రూల్స్ ప్రకారం తాము అడిగినప్పుడు సమాచారాన్ని వెంటనే అందించేలా సోషల్ మీడియా కంపెనీలకు అధికారులు డిమాండ్ చేస్తారని పేర్కొంది. ఇది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. వాట్సాప్ లోని సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్షన్ ఉంటుందని వెల్లడించింది. దీంతో ప్రస్తుత నిబంధనలను పాటించాలంటే ఎండ్-టు-ఎండ్ భద్రతను వదులుకోవాలని వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు మొదట ఎవరు ఫేక్ న్యూస్ ప్రచారం చేశారో గుర్తించి, దాంతో పాటు ప్రభుత్వానికి వారి వివరాలు అందజేయాలి. అందుకే వాట్సాప్ ఈ కొత్త రూల్స్‌ను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా కంపెనీలు ఈ రూల్స్‌ అమలుచేసేదుకు కేంద్రం మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అయితే వాట్సప్ ను సొంతం చేసుకున్న ఫేస్‌బుక్ మాత్రం ఈ కొత్త రూల్స్‌ను ఓకే చేయడం గమనార్హం.

Tags:    

Similar News