WhatsApp: జూన్‌లో 22 లక్షల ఖాతాలని నిషేధించిన వాట్సాప్‌.. కారణం ఏంటో తెలుసా..?

WhatsApp: ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఐటి నిబంధనలు 2021కి అనుగుణంగా జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది.

Update: 2022-08-03 10:15 GMT

WhatsApp: జూన్‌లో 22 లక్షల ఖాతాలని నిషేధించిన వాట్సాప్‌.. కారణం ఏంటో తెలుసా..?

WhatsApp: ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఐటి నిబంధనలు 2021కి అనుగుణంగా జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు మే నెలలో దేశంలో 19 లక్షల అభ్యంతరకర ఖాతాలను నిషేధించింది. అంతేకాదు జూన్‌లో మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు దేశవ్యాప్తంగా 632 ఫిర్యాదులు అందగా వాటిలో 64 కేసులపై చర్యలు తీసుకుంది.

దీని గురించి కంపెనీ ప్రతినిధి ఒకరు ఇలా తెలిపారు. "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నివారించడంలో WhatsApp అన్నింటికంటే ముందువరుసలో ఉందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మా ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను రక్షించడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు"

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 4(1)(డి) ప్రకారం భారతదేశంలోని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. 'అకౌంట్స్ యాక్షన్డ్' నివేదిక ఆధారంగా వాట్సాప్‌ చర్య తీసుకున్న నివేదికలను సూచిస్తుంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం 5 మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న పెద్ద డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ సమ్మతి నివేదికను ప్రచురించాల్సిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News