AC: ఇన్వర్టర్ ఏసీ కరెంట్ లేకపోయినా పనిచేస్తుందా.? దీని అసలు ఉపయోగం ఏంటంటే
AC: ఏసీ కొనుగోలు చేసే ముందు వినిపించే పదాల్లో ఇన్వర్టర్ ఏసీ ఒకటి. సాధారణంగా ఇన్వర్టర్లు కరెంట్ లేని సమయంలో విద్యుత్ సరఫరాను అందిస్తాయి. అయితే ఈ ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ లేకపోయినా పనిచేస్తాయా.? అసలు వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వర్టర్ AC అంటే ఏంటి?
ఇది ఒక ప్రత్యేకమైన కంప్రెసర్ నియంత్రణ సాంకేతికత (Compressor Control Technology). ఇందులో ఉండే ఇన్వర్టర్ సిస్టమ్ ACలోని కంప్రెసర్‌ను గది ఉష్ణోగ్రత ప్రకారం వేగాన్ని ఆటోమేటిక్‌గా మార్చేలా చేస్తుంది. అంటే గది వేడి ఎక్కువగా ఉంటే, కంప్రెసర్ వేగంగా పని చేస్తుంది. ఒకసారి గది చల్లబడ్డాక, కంప్రెసర్ నెమ్మదిగా పని చేస్తుంది.
ఇన్వర్టర్ ACతో విద్యుత్ పొదుపు
ఇన్వర్టర్ AC నిరంతరం చక్కగా పనిచేస్తూ గది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. కంప్రెసర్ ఎప్పుడూ పూర్తిగా ఆపేయకుండా స్మార్ట్‌గా వేగాన్ని నియంత్రించడం వల్ల, విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా, మీ కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది.
నాన్ ఇన్వర్టర్ ACతో తేడా ఏంటి?
నాన్ ఇన్వర్టర్ ACలో కంప్రెసర్ లేదా పూర్తిగా ON లేదా పూర్తిగా OFF అవుతుంది. అంటే, గది చల్లగా అయితే OFF అయిపోతుంది.. మళ్లీ వేడి పెరిగితే ON అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ విద్యుత్ వినియోగమవుతుంది. అలాగే గది ఉష్ణోగ్రత కాస్త హెచ్చుతగ్గులకు గురవుతుంది. కొన్నిసార్లు శబ్దం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇన్వర్టర్ AC లాభాలు ఏంటి?
గది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది, తక్కువ విద్యుత్ వినియోగం, దీర్ఘకాలికంగా పనిచేసే సిస్టమ్, శబ్దం తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆన్/ఆఫ్ కాకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది.