WAVES 2025 : టెక్నాలజీ, వినోదం, రాజకీయం.. ముంబైలో WAVES 2025 మహా సంగమం!

WAVES 2025 : భారతీయ వినోదం, మీడియా పరిశ్రమ సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధమవుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో మే 1 నుంచి 4 వరకు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 జరగనుంది.

Update: 2025-05-01 04:55 GMT

WAVES 2025 : టెక్నాలజీ, వినోదం, రాజకీయం.. ముంబైలో WAVES 2025 మహా సంగమం!

WAVES 2025 : భారతీయ వినోదం, మీడియా పరిశ్రమ సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధమవుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో మే 1 నుంచి 4 వరకు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 జరగనుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో వ్యాపార దిగ్గజాలు, కళాకారులు, టెక్ నిపుణులు, రాజకీయ నాయకులతో సహా మొత్తం 36 సెషన్‌లు ఉంటాయి. WAVES 2025ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, పలు ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.

WAVES 2025 ఎంతో ప్రత్యేకమైనదిగా నిలవనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ వినోదం, మీడియా పరిశ్రమ కొత్త పుంతలు తొక్కనుంది. దీని ఫలితంగా భారతదేశ మీడియా, వినోద పరిశ్రమ 2029 నాటికి రూ.4 లక్షల కోట్లకు పైగా విస్తరించనుంది. భారత మీడియా వినోద పరిశ్రమను 2029 నాటికి రూ.4 లక్షల 23 వేల కోట్లకు చేర్చడంలో WAVES 2025 ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

'మన్ కీ బాత్'లో WAVES గురించి ప్రధాని మోదీ ప్రస్తావన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో WAVESను భారతదేశ క్రియేటివిటీ ఇండస్ట్రీకి ఒక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. ముంబైలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య ప్రసంగం చేస్తారు. ప్రపంచ నాయకులు, క్రియేటర్లతో సంభాషిస్తారు. భారతదేశం 'క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్' దృక్పథాన్ని నొక్కి చెబుతారు.

WAVES 2025కు రానున్న వినోద దిగ్గజాలు

WAVES 2025 మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరగనుంది. ఈసారి WAVES 2025 మీడియా, వినోద పరిశ్రమకు ప్రత్యేకంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో నెట్‌ఫ్లిక్స్, గూగుల్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్, అడోబ్, ఎపిక్ గేమ్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.

సినీ పరిశ్రమ ప్రముఖుల హాజరు

WAVES 2025లో బాలీవుడ్, మరాఠీ, దక్షిణాది చిత్ర పరిశ్రమల నుండి షారుఖ్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొనే, అల్లు అర్జున్, శేఖర్ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు, నిర్మాతలు పాల్గొంటారు. అలాగే, ఈ కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్, బాద్షా, షాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులు పాల్గొంటారు. వీరందరూ కలిసి వినోద పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు.

Tags:    

Similar News