Vivo Y300i 5G: సైలెంట్‌గా మరో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో.. మార్చి 14న మొదటి సేల్..!
Vivo Y300i 5G: వివో సైలెంట్‌గా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టిన Vivo Y200i సక్సెసర్. అవును, కంపెనీ తన 'Y' సిరీస్‌లో Vivo Y300i 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.
Vivo Y300i 5G: సైలెంట్‌గా మరో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో.. మార్చి 14న మొదటి సేల్..!
Vivo Y300i 5G: వివో సైలెంట్‌గా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టిన Vivo Y200i సక్సెసర్. అవును, కంపెనీ తన 'Y' సిరీస్‌లో Vivo Y300i 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ను రూ.18 వేల ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మార్చి 14 నుంచి సేల్ కూడా ప్రారంభం కానుంది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Vivo Y300i 5G Features And Specifications
Vivo Y300i స్మార్ట్‌ఫోన్‌లో 6.68-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1608×720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 Octa కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Origin OSతో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం డ్రినో 613 GPU కూడా అందించారు. ఈ ఫోన్‌లో 8GB , 12GB ర్యామ్, 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.
Vivo Y300i ఫోన్ కెమెరా సెటప్ అద్భుతంగా ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది LED ఫ్లాష్‌తో కూడా వస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. మొబైల్‌లో IR సెన్సార్ ఉంది. ఇందులో డ్యూయల్ సిమ్, యుఎస్‌బి టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. .
Vivo Y300i 5G Price
Vivo Y300i ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,001. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,200గా ఉంది. అలాగే, 2GB + 512GB స్టోరేజ్ మోడల్‌ను 21,600 రూపాయలకు పరిచయం చేశారు. ప్రస్తుతం, ఈ ఫోన్ ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది. మార్చి 14 నుంచి చైనాలో తొలి విక్రయాలను ప్రారంభించనుంది. ఇది త్వరలో భారత మార్కెట్‌లోకి రానుంది.