Vivo X200 FE Launch Soon: వో నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది.. పూర్తి వివరాలు..!

Vivo X200 FE Launch Soon: వివో త్వరలో భారతదేశంలో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Update: 2025-05-11 12:00 GMT

Vivo X200 FE Launch Soon: వో నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది.. పూర్తి వివరాలు..!

Vivo X200 FE Launch Soon: వివో త్వరలో భారతదేశంలో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వివో ఫోన్ X200 సిరీస్ కింద లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఎక్స్ 200 ప్రో మినీ లేదా వివో ఎక్స్ 200 ఎఫ్‌ఇ పేరుతో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో రావచ్చు, అంటే ఈ ఫోన్ వాటర్‌ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను నీరు, దుమ్ము మొదలైన వాటిలో కూడా ఉపయోగించవచ్చు.

Vivo X200 FE Colour Options And Price

వివో మొదట ఈ ఫోన్‌ను X200 ప్రో మినీ పేరుతో లాంచ్ చేయబోతుంది, కానీ ఇప్పుడు వస్తున్న నివేదికల ప్రకారం, దీనిని వివో X200 FE పేరుతో పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే రూ. 50,000 నుండి రూ. 60,000 పరిధిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo X200 FE Features

Vivo X200 FE ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో రావచ్చు. అయితే, ముందుగా ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో వస్తుందని కూడా పేర్కొన్నారు. ఈ ప్రాసెసర్‌ను మీడియాటెక్ ఇంకా లాంచ్ చేయలేదు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో 12జీబీ ర్యామ్ + 256జీబీ,16జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫంటౌచ్‌ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ శక్తివంతమైన 6,500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో రానుంది

వివో నుండి వచ్చిన ఈ కాంపాక్ట్ డిజైన్ ఫోన్ చిన్న 6.31-అంగుళాల OLED డిస్‌ప్లేతో రావచ్చు. ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో డిస్‌ప్లే ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. 50మెగాపిక్సెల్ మెయిన్ సోనీ IMX921 కెమెరా సెన్సార్‌ ఉంటుంది. దీనితో పాటు, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50మెగాపిక్సెల్ థర్డ్ టెలిఫోటో కెమెరాను ఫోన్‌లో చూడవచ్చు. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Tags:    

Similar News