Vivo Satellite Smartphone: సరికొత్త టెక్నాలజీతో దూసుకొస్తున్న వివో.. సిగ్నల్ లేకపోయినా కాల్స్, ఇంటర్నెట్..!
Vivo Satellite Smartphone: వివో త్వరలో శాటిలైట్ కనెక్టవిటీతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. దీంతో నెట్వర్క్ లేకపోయినా కాల్స్, ఎస్ఎమ్ఎస్, ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు.
Vivo Satellite Smartphone
Vivo Satellite Smartphone: టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుంది. ఈ క్రమంలోనే వివో త్వరలో ఎలాంటి నెట్వర్క్ లేకుండా పనిచేసే మొబైల్ విడుదల చేయబోతుంది. మీరు అడవిలో ఉన్నా లేదా పర్వతాలపై ఉన్నా మీకు ఇకపై నెట్వర్క్ అవసరం లేదు. మీరు నెట్వర్క్ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత నెట్వర్క్ అందించడానికి సిద్ధం చేస్తుంది. ఈ ఫోన్‌ని డైరెక్ట్‌గా శాటిలైట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా కాలింగ్, డేటా సేవలను అందిస్తుంది. లీక్స్ ప్రకారం కంపెనీ ఈ ఫీచర్‌ను Vivo X100 అల్ట్రాలో తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ఎందుకు చాలా ప్రత్యేకమైనది?
పర్వత ప్రాంతాలలో లేదా విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు పని చేయని చోట కూడా మీరు ఈ ఫోన్ నుండి కాల్స్ చేయగలరు. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ టోక్నాలజీ ఇప్పటికీ కొత్తది, క్రమంగా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లలో పరిచయం చేయనుంది. అయితే ఆపిల్ ఇప్పటికే తన ఐఫోన్‌లో ఈ ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తోంది. అయితే మీరు దీన్ని భారతదేశంలో ఉపయోగించలేరు.
ఇది ఎలా పని చేస్తుంది?
ఈ ప్రత్యేక టెక్నాలజీలో మీ ఫోన్ ఉపగ్రహానికి వెళ్లే ప్రత్యేక రకం సిగ్నల్‌ను పంపుతుంది. ఉపగ్రహం ఈ సిగ్నల్‌ను స్వీకరించి, దానిని మరొక ఫోన్ లేదా నెట్‌వర్క్‌కి ప్రసారం చేస్తుంది. దీనితో మీరు నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఎటువంటి సమస్య లేకుండా వేరొకరితో కనెక్ట్ అవ్వవచ్చు.
Vivo కాకుండా Xiaomi, Huawei వంటి అనేక పెద్ద కంపెనీలు కూడా శాటిలైట్ ఫోన్‌లపై పనిచేస్తున్నాయి. కొన్ని చిప్‌ల తయారీ కంపెనీలు కూడా ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. ఈ టెక్నాలజీని త్వరలో భారతదేశంలో కూడా చూడవచ్చు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే BSNL వంటి సంస్థలు కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి.
సాంకేతికత చాలా ఖరీదైనది
సమాచారం ప్రకారం ఈ టెక్నాలజీ ప్రస్తుతం చాలా ఖరీదైనది. అందువల్ల ఇది చాలా తక్కువ స్మార్ట్‌ఫోన్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శాటిలైట్ కనెక్షన్ కూడా ఫోన్ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంది.