Vivo V60e 5G: వివో ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. ఎంత చూస్తే షాకైపోతారు..!
వివో అక్టోబర్ 7, 2025న తన గేమ్-ఛేంజర్ Vivo V60e 5G ఫోన్‌ను విడుదల చేసింది, దీనిలో 200MP మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో పాటు AI-ఆధారిత ఫోటోగ్రఫీ టూల్స్ కూడా ఉన్నాయి.
Vivo V60e 5G: వివో ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. ఎంత చూస్తే షాకైపోతారు..!
Vivo V60e 5G: వివో అక్టోబర్ 7, 2025న తన గేమ్-ఛేంజర్ Vivo V60e 5G ఫోన్‌ను విడుదల చేసింది, దీనిలో 200MP మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో పాటు AI-ఆధారిత ఫోటోగ్రఫీ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద 6500 mAh బ్యాటరీ ప్యాక్, క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ డిస్‌ప్లే లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు అధికారిక వివో వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ సేల్ కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్,గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.5,000 వరకు భారీ తగ్గింపులతో అందిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫోన్ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో V60e 5G ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. కానీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్‌లలో డిస్కౌంట్ల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,000 తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. అంటే చివరగా ఈ ఫోన్ రూ. 31,999కి లభిస్తుంది.
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేస్తే యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. అమెజాన్ నుండి కొనుగోలు చేస్తే ఎంచుకున్న క్రెడిట్ కార్డులపై రూ.3,200 వరకు డిస్కౌంట్, అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లింపు చేస్తే రూ.959 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
వివో V60e 5జీ ఫోన్ 6.77-అంగుళాల స్క్రీన్, అల్ట్రా-స్లిమ్ బెజెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, ఇది అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. సూర్యకాంతిలో కూడా స్పష్టమైన విజువల్స్ కోసం 5000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్ష్ అందించారు. వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ ఉంది.
వివో V60e 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.ఈ ఫోన్‌తో అసాధారణమైన పనితీరును పొందుతారు. ఇందులో అల్ట్రా-లార్జ్ వీసీ స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది, ఇది భారీ వినియోగం సమయంలో ఫోన్‌ను కూల్‌గా ఉంచుతుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 15తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో 3 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్లు, 5 సంవత్సరాల సేఫ్టీ అప్‌డేట్లు పొందుతారు.