Vivo T4x 5G: వివో అంటేనే బెస్ట్ కెమెరా.. కంపెనీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!
Vivo T4x 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో భారత్‌లో Vivo T4xని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Vivo T4x 5G: వివో అంటేనే బెస్ట్ కెమెరా.. కంపెనీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!
Vivo T4x 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో భారత్‌లో Vivo T4xని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వివో ఇటీవలే T4xని వచ్చే వారం దేశంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో సెగ్మెంట్లో అతిపెద్ద బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ఇంకా ఇతర ఫీచర్లను ప్రకటించనప్పటికీ, అవి ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo T4x Launch Date
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. Vivo T4x దేశంలో మార్చి 5 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్‌లు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ షేడ్ వంటి కలర్ ఆప్షన్స్‌లో వస్తుందని కంపెనీ వెల్లడించింది.
Vivo T4x Features
స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ 7300 ప్రాసెసర్ ఉంటుంది. పవర్ కోసం 6,500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఆఫర్ చేస్తోంది.
కెమెరా విషయానికి వస్తే ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండచ్చు. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అంతేకాదు ఖరీదైన ఫోన్లలో కనిపించే ప్రత్యేక AI ఫీచర్లను కూడా కంపెనీ ఈ ఫోన్‌లో అందించనుంది. లీక్స్ ప్రకారం.. AI ఎరేస్, ఫోటో ఇమ్‌ప్రూవ్‌మెంట్ వంటి AI ఫీచర్లను ఇందులో చూడవచ్చు. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
Vivo T4x Price
వివో T4x బేస్ వేరియంట్ ధర రూ. 12,499గా ఉండవచ్చని అంచనా వేయగా, 6GB RAM వేరియంట్ ధర రూ. 13,999, 8GB RAM వేరియంట్ ధర రూ. 15,499గా ఉంటుంది. ఇటీవల కంపెనీ ఈ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.