Vivo T4 Pro 5G: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ డీల్.. వివో ఫోన్‌పై రూ.5 వేలు డిస్కౌంట్..!
Vivo T4 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్ ప్రారంభమైంది. దీంతో వివిధ బ్రాండ్‌ల నుండి ఫోన్‌లు, గాడ్జెట్‌లు, ఉత్పత్తులు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.
Vivo T4 Pro 5G: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ డీల్.. వివో ఫోన్‌పై రూ.5 వేలు డిస్కౌంట్..!
Vivo T4 Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్ ప్రారంభమైంది. దీంతో వివిధ బ్రాండ్‌ల నుండి ఫోన్‌లు, గాడ్జెట్‌లు, ఉత్పత్తులు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా భారీగా ఆదా చేయచ్చు. ఈ సేల్‌లో Vivo T4 Pro 5G అతిపెద్ద డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌పై వివిధ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ డీల్స్ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గిస్తాయి. ఫోన్ ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. బిగ్ బ్యాటరీ లైఫ్, బెస్ట్ కెమెరా ఫీచర్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు ఉత్తమ ఎంపిక. ఈ నేపథ్యంలో ఫోన్‌పై అందుబాటులో ఉన్న అన్ని డీల్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 8జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ.32,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 15శాతం డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయచ్చు. దీని తర్వాత ప్రభావవంతమైన ధర రూ.27,999 అవుతుంది. రూ.5,000 వరకు కూడా ఆదా చేయచ్చు. అంతే కాకుండా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు.
ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది ఫోన్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. మోడల్‌ను బట్టి రూ. 26,700 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద, కస్టమర్‌లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ.2,500 డిస్కౌంట్ పొందచ్చు. అలానే మొబైల్‌ను రూ.4,120 నో-కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికతో ఆర్డర్ చేయచ్చు. దీనిని మీ ఇంటికి డెలివరీ చేయచ్చు.
ఈ వివో ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అందించారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఫోన్ మెయిన్ కెమెరా OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్‌లు. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.బ్యాకప్ కోసం 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6500mAh బ్యాటరీ అందించారు. ఇది IP69 రెసిస్టెంట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇది వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది.